My
interest on road trips started when I was in my 8th class.
ఊహ తెల్సిన తర్వాత నేను వెళ్లిన మొదటి రోడ్ ట్రిప్ – మా వకీలు మావయ్య సెకండ్ హ్యాండ్
Maurti Esteem కారు కొన్న రోజునే వరంగల్ ట్రిప్ వేశారు. ఆ ప్రయాణం మొత్తం నేను డ్రైవరు సీటు లో ఒక
కాలు, పాసెంజరు సీటు మీద మరో కాలు వేసి gear box మీద
కూర్చున్నా . పొద్దున్న పదింటికి బయల్దేరితే రాత్రి ఒంటిగంట కి తిరిగి
hyderabad వొచ్చాము . ఈ ప్రయాణం లో వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ
బలంగా నాలో నాటుకుని పొయ్యాయి.
అలా మొదలైన నా ఈ road
trips వెర్రి చదువు అయిన తర్వాత ఉద్యోగం రావడం వల్ల ముదిరి పాకాన పడింది . చదువుకుంటున్న రోజుల్లో ఎప్పుడు motor
bike నడిపింది లేదు. అమ్మ bajaj spirit అపుడపుడు నడిపే వాడిదని ; అది కూడా ఇంటి దగ్గెర. నాకుంటూ ఒక bike - June,
2011 లో నాన్న కొనిచ్చారు – Yamaha
SZ. అప్పటి నించి నా bike మీద వెళ్ళాలి అనే pitchi కోరిక మొదలు అయ్యింది కానీ Hyderabad లో అమ్మ వాళ్ల దగ్గర ఉండటం , వాళ్ళు దీనికి ఒప్పుకోక పోవడం సాధారణం అయ్యాయి . అయినా సరే వాళ్ళకి తెలీకుండా విజయవంతంగా Hyderabad నించి 6 ట్రిప్స్ (చిన్నవి పెద్దది కలుపుకుని ) వేయటం జరిగింది.
2009 నించి teambhp
forums చదవటం మొదలు పెట్టాను .. ఇప్పటికీ తరచుగా చదువుతాను . A BIG source
of inspiration for me.
ఉద్యోగ రీత్యా USA వొచ్చిన తర్వాత కారు కొనడం చాల పెద్ద విషయం. ఇక్డడ తిరిగినా సరే India లో తిరిగితే ఆ kick ఏ వేరు..
ఇక నా trips సంగతి చెప్పాలి అంటే ఒక్కడినే వెళ్ళినవి ఉన్నాయి , స్నేహితుల తో వెళ్ళినవి ఉన్నాయి , అమ్మ వాళ్ళతో వెళ్ళినవి ఉన్నాయ్, మా ఆవిడా, పాపతో కూడా !
నేను ఎదో పెద్ద సంచారి (travel
freak) ఏమి కాను కానీ ఎందుకో road ప్రయాణాలు అంటే పిచ్చి.. The reason why I
like to drive – I don’t think of anything else other than watching the road,
control the steering. My mind and heart would be empty – similar state attained
during meditation.
కచ్చితంగా Hyderabad నుండి కన్యాకుమారి కి bike మీద వెళ్తాను.. నా Yamaha
bike మీద.
నా ఒక్కో trip గురించి మళ్ళీ సమయం వొచ్చినపుడు చెప్పుకుందాం...