Below are some of the lines translated to Telugu from English based on the extract shared by my friend through his post. Grammar తప్పులు ఉంటే మన్నించండి, అసలు అర్థమే తప్పు అనుకుంటే క్షమించండి. ఇక కానివ్వండి:
ఇప్పటి నన్ను నా గతంతో పొల్చి చూస్తే నువ్వు నాకు ఎంతగానో అపురూపం.
ఇలాంటి సందర్భాలలో నేను ఎంతగా ఎదిగానో, నీ వల్ల ఎంత నెర్చుకున్నానో అర్థం అవుతుంది.
నీ వల్ల నా వ్యక్తిత్వం ఒక మంచి రూపాన్ని సంతరించుకుంది.
మొదటి సారి నిన్ను cinema హాల్లో చుసినపుడే నీ ప్రేమ లో పడ్డాను.. ప్రేమికుడిని అయ్యాను.. ఆకాశ వీధిలో ఎగురుతున్న పక్షులు ఆగిపొవడం.. సముద్రపు అలలు స్తంబించిపోవడం.. కాలం కూడా ఎమిటి ఈ వింత అన్నట్టు నా కోసం వేచి ఉండటం.. నా హ్రుదయం ఎప్పుడూ లేనట్టుగ నన్ను వొదిలేసి గగనంలో విహరించడం.. ఇవన్నీ నిన్ను చుసిన తొలిచూపు లో జరిగాయి అని చెప్పడం అతిశయొక్తి కాదేమొ..!
నా ఈ సూన్యం అయిన మనసులో, నీ గురించి ఎన్నో ప్రశ్నలు నింపుకుంది, నీ గురించి తెలుసుకోవాలి అని నా మనస్సు ఎంతగానో తహ తహ లాడింది.
నీతో మట్లాడకుండా, కేవలం దూరంగా ఉండి చూడడానికి ఎన్నో సార్లు తరగతి ఎగ్గొట్టిన విషయం నాకు ఇంకా గుర్తుంది.
నీ గురించి నిరాఘాటంగా మాట్లాడి ఇంకెన్నో సార్లు నా స్నేహితులు “వొద్దు రా భగవంతుడా.. ఇక ఆపు” అని విసుగు తెప్పించిన వేళలు ఉన్నాయి.
మనము కలిసేది వారానికి ఒక్క సారి, అది కుడా కొన్ని గంటలు అయినా సరే, ఎప్పుడూ నేను విచారించలేదు. ఆ కొన్ని గంటల కోసం మళ్ళీ మళ్ళీ రావటానికి అయినా సిద్దంగా ఉంటాను అని నా మనస్సాక్షి తెలుసు.
నేను ఒక పిచ్చి వాడిని అని, కాలము వృధా చెస్తున్నాను అని నా చుట్టూ ఉన్నవాళ్ళ గట్టి నమ్మకం, వాళ్ళ మాటలు నిజం అయి ఉండొచ్చు, నీ వల్ల నేను ఎంతగా ప్రేరింప పడ్తానో వాళ్ళకి ఎంత చెప్పిన అర్థం కాదు.
నీ పట్ల నేను ప్రేమానురాగాలు చూపించినా, నిన్ను విడిచి ఉండలేక విచారించినా, కొంత సేపు మాత్రమే కలిసి ఉన్నాను అని విరహ వేదన అనుభవించి కళ్ళ వెంట నీళ్ళు తిరిగినా, నిన్ను సరిగ్గా చూసుకోలేకపొయాను అని నా మీద నాకు కోపం వొచ్చినా, కలవటం వీలు కాకుండా ఉన్నందుకు నిరాశ చెందినా, ఈ నవరశాలు అన్నీ కలకలిసి నన్ను ఒక మనిషిగా సంపూర్ణతనిచ్చాయి.
భావ ప్రకటన భాష వల్లే తన అందాన్ని సంతరించుకుంటుంది అని నా విశ్వసం.
సినిమాల పట్ల నా ప్రేమ గురించి వివరిస్తున్నా.. ఆ ప్రేమానందం వెనక ఒక కారణం ఉంది.
No comments:
Post a Comment